మ మ్మాదరించి కాపాడవయ్యా గణపయ్యా అంటూ జడ్పిటిసి మారం వెంకటరెడ్డి గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద జెడ్పిటిసి మారం వెంకటరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదేవిధంగా మండలంలోని తాళ్లూరు, కొత్తపాలెం, శివరామపురం, తురకపాలెం, తూర్పుగంగవరం, నాగంబోట్ల వారిపాలెం, వెలుగువారిపాలెం, బొద్దికూర పాడు, తదితర గ్రామాలలో భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.
