సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు అధ్యక్షతన చాంబర్ లో మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టంపై జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్స్ మరియు మెంబర్, ఎక్స్ అఫీషియోలతో ఎన్. లక్ష్మా నాయక్, జిల్లా ఎస్.సి. సంక్షేమం & సాధికారత అధికారి, ఒంగోలు మరియు మెంబర్ సెక్రటరీ వారి అధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించటమైనది.
ఈ సమావేశమునకు సభ్యులు, షేక్ మర్ధన్ ఆలీ, సూపరింటెండింగ్ ఇంజనీర్, గ్రామీణ నీటి సరఫరా, ఒంగోలు, కె. కొండయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్, పంచాయితీ రాజ్, ఒంగోలు, ఈ పేరయ్య, జిల్లా ప్రధాన అధికారి, హౌసింగ్, ఒంగోలు, ఎర్నపాటి నిర్మల, అధ్యక్షురాలు, జిల్లా మహిళా సమాఖ్య, ఒంగోలు మరియు మెంబర్ ఎక్స్ అఫిషియోలుగా, జాలిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, సి. మనోహర్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, ఒంగోలు, బి.ఎస్.గిరి కుమార్, కమీషనర్, మార్కాపురం మున్సిపాలిటీ, ఎ.జి.యం పి.డి.సి.సి. బ్యాంక్ లిమిటెడ్, ఒంగోలు, కె.శ్రీనారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, ఒంగోలు మెంబర్ సెక్రటరీ, ఎక్స్ అఫిషియోగా ఎన్. లక్ష్మా నాయక్, జిల్లా ఎస్.సి. సంక్షేమం & సాధికారత అధికారి, ఒంగోలు మరియు సామజిక కార్యకర్తలు (సోషల్ వర్కర్స్ )
- మిట్నాసల బెంజిమెన్, 2. డా. కిషోర్ కుమార్ మందా, 3. బలసాని జెలీనా 4. తోరటి కృపమ్మ గార్లు హాజరైనారు.. ఈ కార్యక్రమములో
- జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ ఫ్రీగా ప్రకటించాలి; ఇప్పటి వరకు ప్రకటించకుంటే, మున్సిపాలిటీలు మరియు గ్రామాల్లో ఒక నెలలోపు ‘స్వచ్ఛతా అభియాన్’ మొబైల్ యాప్లో అపరిశుభ్రత మరుగుదొడ్లు మరియు మాన్యువల్ స్కావెంజింగ్ వివరాలను అప్లోడ్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, ఒంగోలు మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించడమైనది.
- మాన్యువల్ స్కావెంజర్స్ కి మరియు సఫాయి కర్మచారిలకు నిర్వచనం చేసి సంబంధిత అధికారులకు పంపాలని డా.కిశోర్ మందా, సామాజిక కార్యకర్త కోరారు.
- సఫాయి కర్మచారిలకు రైన్ కొట్స్ ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బెంజిమన్, సామాజిక కార్యకర్త కోరారు.
- పంచాయితీ పరిధిలో సఫాయి కర్మచారీలకు జిల్లా వ్యాప్తంగా హెల్త్ క్యాంప్ నిర్వహించాలని, వారికి కూడా మండల మరియు గ్రామ స్థాయిలో కూడా రైన్ కొట్స్ ఇవ్వాలని, అలాగే 44 ప్రొటెక్టివ్ గేర్స్ కూడా ఇవ్వాలని బెంజిమన్, సామాజిక కార్యకర్త కోరారు.
- స్కూల్ లో 2749 మంది సఫాయి కర్మచారిలు ఉన్నారని, వాళ్ళకి ప్రొటెక్టివ్ గేర్స్ ఇస్తున్నారా లేదా అని
బెంజిమన్, సామాజిక కార్యకర్త కోరారు. 6. శానిటేషన్ కు సంబంధించి సైడ్ కాలువలు తీసి వాటిని క్లీన్ చేయడం లేదని, శానిటేషన్ చేయాలని, హాండ్ వాష్ ప్రొవైడ్ చేయాలని శ్రీమతి తోరటి కృపమ్మ, సామాజిక కార్యకర్త కోరారు.
పై సమావేశములో చర్చించిన మినిట్స్ కు సంబందించి శ్రీయుత సంయుక్త కలెక్టర్, ఒంగోలు వారు పై సభ్యులు అడిగిన ప్రతి ఒక వాటికి వెంటనే సంబంధిత శాఖల అధికారులు 15 రోజుల లోపల పూర్తి తగు చర్యలు తీసుకొని నివేదికలు సాంఘిక సంక్షేమ శాఖకు అందించవలసినదిగా ఆదేశించినారు.