వైఎస్సార్సీపీ నాయకుడు, దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ కి ముండ్లమూరు మండల నూతన మండల పార్టీ అధ్యక్షుడుగా నియమితులైన బిజ్జం వెంకట సుబ్బా రెడ్డి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో ఆయనను కలసి పుష్పగుఱ్ఱం అందజేసారు. పార్టీ అభ్యున్నతికి తగిన విధంగా కృషి చెయ్యాలని డాక్టర్ మద్దిశెట్టి సూచించారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్ష పదవిలో నియమించినందుకు బిజ్జం వెంకట సుబ్బా రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ కి, జిల్లా పరిశీలకులు, ఎంపీ విజయసాయి రెడ్డికి, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు జంకె వెంకట రెడ్డికి, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మండల పార్టీ కార్యకర్తలు అందరూ సహకరించి తమ వంతు చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.
