హరిహర అయ్యప్ప నిత్య అన్నదాన ట్రస్ట్కు భగీరథ ఫ్యాక్టరీ యాజమాన్యం చేయూతను అందించింది. 50 బస్తాల బియ్యం, 250 కేజీల కందిపప్పు అందజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ సింగవరపు చంద్రశేఖర్ సూచన మేరకు ట్రస్టు సేవా కార్యక్రమాల దృష్ట్యా ఈ సహకారాన్ని అందజేసినట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కాకాని హరిబాబు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, లింగమనేని వెంకటరామయ్య తెలిపారు. బియ్యం, కందిపప్పును మంగళవారం యరజర్ల గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి శ్రీనివాసులు, ట్రస్ట్ ఛైర్మన్ చల్లా అంకరాజు, కాకర్ల వెంకట్రావు (గురుస్వామి), పందెళ్ళ రామయ్య, చల్లా కృష్ణ, నల్లబోతుల శివకాశి, పందెళ్ల గోపిలకు అందజేశారు. మాలధారణ చేసే స్వాములచే ఏర్పాటు చేయబడిన అన్నదాన కార్యక్రమం నిర్విరామకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఫ్యాక్టరీ తరుపున సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.
