ప్రభుత్వం పాడి రైతులను అభివృద్ధి చేసేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని వైకెపి ఎపిఎం ఎం హనుమంతరావు అన్నారు. మండలంలోని పూరి మెట్ల గ్రామంలో మంగళవారం జగనన్న పాలవెల్లువ పై పాడి రైతులతో సమావేశం దర్శి పశువైద్య శాఖ ఏడి ఏ పురుషోత్తం రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి పాడి రైతులు బ్యాంకుల ద్వారా అందిస్తున్న రాయితీ రుణాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పూరిమెట్ల గ్రామంలో అమూల్య పాలకేంద్రం బాగా నడుస్తుందని మరింత ఎక్కువగా పాలు పెంచే విధంగా మహిళా సంఘాలు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా 30 మంది రైతులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం రెండు లక్షల నుండి 20 లక్షల వరకు రుణాలను అందించేందుకు పీడీసీసీ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మారెళ్ళ పశు వైద్యాధికారి కాశిరెడ్డి,పి డి సి సి బ్యాంకు సూపర్వైజర్ సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.
