జిల్లాలో జరుగుతున్న ఆటల పోటీలలో అండర్ 14 బాలికల విభాగంలో లాంగ్ జంపులో ముళ్ళమూరు ఆదర్శ పాఠశాలవిద్యార్థి ఎస్.కె సోఫియా ప్రతిభ చాటింది. లాంగ్ జంప్ లో జిల్లా స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. విద్యార్థిని సోఫియా కు మెడల్స్ అందజేశారు. ప్రతిభ చాటిన విద్యార్థినిని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు, ఫిజికల్ డైరెక్టర్ రాముడు, ఉపాధ్యాయులు అభినందించారు.
