కలెక్టరేట్ సమావేశ మందిరంలో
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా విజిలెన్స్ కమిటీ మరియు జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి సంయుక్త సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా సంయుక్త కలెక్టర్
కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఒంగోలు నగర మేయర్
గంగాడ సుజాత ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు .జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ్ భాస్కర్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
రెండు సంఘాలలో సభ్యులు అయినటువంటి వివిధ వినియోగదారుల సంఘాల నాయకులు, సామాజిక హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై వినియోగదారులు, రేషన్ కార్డుదారులు, సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఒంగోలు నగర బస్టాండ్ పరిశుభ్రంగా ఉండడం లేదని తగినన్ని టాయిలెట్లు లేవని, అదేవిధంగా నగరంలో మిని బస్సులు నడపకపోవడం ఇబ్బందిగా ఉందని, అదేవిధంగా పాలల్లో కల్తీ విరివిగా జరుగుతుందని, రేషన్ ద్వారా జారీ చేయాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయని, పెట్రోల్ బంకుల్లోవినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోవిఫలమవుతున్నారని, గ్యాస్ వినియోగదారుల దగ్గర ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని వివిధ సభ్యులు అంశాలను లేవనెత్తారు. బస్టాండ్ పరిశుభ్రత విషయంలోనూ అదనపు టాయిలెట్లు కల్పించడంలోనూ తగిన చర్య తీసుకోవాలని కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ఆర్టీసీ ఆర్ఎం ని ఆదేశించారు. పాలల్లో కల్తీ ఇతర పదార్థాల్లో కల్తీ ఆహార పదార్థాల్లో పరిశుభ్రత నిరంతరం తనిఖీ చేయడానికి ఆహార భద్రతా శాఖ మరియు పౌరసరఫరాల శాఖవారు దాడులు నిర్వహించాలని నిర్దేశించారు.
జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ తనిఖీ చేయాలని కనీస సౌకర్యాలు కల్పించడంతో విఫలం అయితే వారిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు.
గిద్దలూరు నగర పంచాయితీ లో రోజంతా వెలుగుతున్న వీధి దీపాల గురించి, టంగుటూరు లోతరచూ సంభవిస్తున్న విద్యుత్ అంతరాయాలు గురించి సరైన చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ మార్కెట్ చుట్టుపక్కల, నాన్ వెజ్ మార్కెట్ చుట్టుపక్కల పరిశుభ్రత కాపాడాలని
ఆదేశించారు.
ప్లాస్టిక్ అనేది పెనుభూతమని, ప్లాస్టిక్ వాడక నిషేదమునకు సహకరించి ముందడుగు వేయాలని మేయర్ శ్రీమతి గంగాడ సుజాత అభ్యర్థించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం పక్కదారులు పట్టకుండా అన్ని చర్యలు..
తీసుకుంటున్నామని తెలియజేశారు.
కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల గత ఐదు సంవత్సరాలుగా ఈ సమావేశాలు నిర్వహించలేకపోయామని ఇక పైన తరచుగా సమావేశాలు నిర్వహించి దానికి సంబంధించిన చర్యలను నివేదిక కూడా ఇస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్ తెలియజేశారు.
ప్రకాశం జిల్లా లో ని వివిధ ఆయిల్ కంపెనీల సీల్స్ ఆఫీసర్స్, సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా మేనేజర్, ఏపీ ఎస్ సి ఎస్ సి ఎల్ , జిల్లా ఆహార భద్రతాధికారి, తూనికల కొలతలు అధికారి, ఆర్టీసీ ఆర్ఎం, డ్రగ్ కంట్రోలర్, ఒంగోలు సహాయ సరఫరాధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, వాణిజ్య పనులు అధికారి తదితర అధికారులంతా హాజరై తమ తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని తెలిపారు .



