జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం విశేష పూజలు
నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు
చెల్లించుకున్నారు. పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావుల ఆధ్వర్యంలో పూజలు
నిర్వహించారు. భక్తులకు కావలసిన సౌకర్యాలను ఈఓ ఎబి భాస్కర్ రెడ్డి, ఆలయ
అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
