వర్షాలతో పంటలకు జీవ కళ – రబీలో సాగుకు అనుకూలమైన వర్షపాతం – తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు

సకాలంలో వర్షాలు పడటం వలన పంటలకు జీవం పోసినట్లు అయినదని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలో సాగు చేసిన పలు పంటలను ఆయన సోమవారం పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం 408.1 మి. మీ లు కాగా నాలుగు నెలల 25 రోజుల్లో 525.2 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్ కు గాను 117.1 మి.మీ మిగులు వర్షపాతం కురిసిందని చెప్పారు. రబీ పంటలకు ఈ వాతావరణం అశాజనకంగా ఉందని అన్నారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిరప, కంది తో పాటుగా చిరుధాన్యాలైన జొన్న, రబీ సజ్జ, కొర్ర, రాగి, వరిగ, ఊద, సామ, ఆరిక. ఆండ్రు కొర్రలు సాగు చేసుకోవటానికి అనుకూలత ఏర్పడిందని అన్నారు.
సాగర్ జలాలు ప్రస్తుతం అందే పరిస్థితి లేదని అన్నారు. తక్కువ నీటి వనరులతో పండే పంటలు వేసుకునేందుకు అనుకూలత ఏర్పడిందని అన్నారు. రైతులు తగిన విధంగా స్పల్పకాలిక రకాలను ఎంపిక చేసుకుని విత్తుకోవాలని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *