తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం గ్రామంలో సోమవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్టు చేయడం జరిగిందన్నారు. రాజకీయ క్షేత్రంలో ఎదుర్కోలేక అనవసరమైన ఆరోపణలు చేస్తూ చంద్రబాబుకు బెయిల్ రాకుండాఅడ్డుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణ స్వామి,శివలక్ష్మి, కోటేశ్వరమ్మ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
