ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో విప్లవత మార్పులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గొప్ప ఆలోచన చేసి ప్రజల ముంగిట ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మండల జెసిఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి అన్నారు. మండలంలోని కెల్లంపల్లి గ్రామంలో సచివాలయం వద్ద బుధవారం గ్రామ సర్పంచి జమ్ముల గురవయ్య అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు మాట్లాడుతూ 45 రోజులు పాటు గ్రామాల్లో ప్రతి సచివాలయం వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ శిబిరాలకు ఒంగోలు రిమ్స్ స్పెషలిస్టు వైద్యులు శ్రీదేవి, వెన్నెల మాట్లాడుతూ ముందుగా ఆరోగ్యపరమైన సమస్యలు గుర్తించి చికిత్స ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన పరీక్షలు చేసి మందులు అందిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరంలో మారెళ్ళ, ముండ్లమూరు వైద్యాధికారులు సిహెచ్ ప్రవీణ్ కుమార్, వి జ్యోతి లు 400 మందికి వైద్య పరీక్షలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసరావు, సూపర్వైజర్ సుబ్బారావు, హెల్త్ విజిటర్ కన్యాకుమారి,ఏఎన్ఎం ప్రసాద్, రజిత, ఫార్మసిస్ట్ కే యుగంధర్, ల్యాబ్ టెక్నీషియన్ నాగార్జున, ఏం ఎల్ హెచ్ పి స్వప్న, నందిని ,నాగలక్ష్మి ,యెహోషువ, తదితరులు పాల్గొన్నారు.
