ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్సనర్ల కు గత కొన్ని నెలలుగా జీతాలు, పెన్షన్లు కోసం ప్రతి నెల 10 నుండి 15వ తేదీ వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుందని అలా జరగకుండా ఉండాలి అంటే ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తేదీ జీతాలు, పెన్షన్లు చెల్లించ టానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు కె.వి.జి.కీర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్ కుమార్,జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.అమ్మయ్య, ఐఫియా కౌన్సిలర్ పి.వి.సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ నెల పదో తేదీ కావస్తున్న చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇంతవరకు జీతాలు జమ కాకపోవడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. ప్రతినెల బ్యాంకులలో ఈఎంఐలు కట్టాల్సి ఉండటం జీతాలు సమయానికి పడకపోవడం వల్ల ఎక్కువ పెనాల్టీ కట్టాల్సి రావడం ఇంటి బాడుగ, పాల బిల్లు, కూరగాయలు, పండ్లు, సరుకులు, నిత్యవసరాలు తీర్చుకోవడం ఉద్యోగ ఉపాధ్యాయులకు కష్టతరం అయిపోయిందని కనుక ప్రతినెల ఒకటవ తేదీని జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల అంతా కష్టపడి పనిచేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబమని ప్రశ్నించారు. కనుక సకాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 2019 నుండి ఫెయిల్ అయిన పదవ తరగతి విద్యార్థులకు సప్లమెంటరీ ఎగ్జామ్స్ రాయుటకు ఫీజు చెల్లింపును ప్రతి ఒక్క విద్యార్థి చెల్లించేలా ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఒకవేళ విద్యార్థులు చెల్లించకపోతే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులపై విద్యార్థులు ఫీజు కట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపే అధికారులు,కట్టకపోయినా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కట్టాలని చెప్పడం కంటే ప్రభుత్వమే ఎటువంటి ఫీజు చెల్లించకుండా విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పాఠశాలల నిర్వాహణకు గానూ నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.పాటశాలల నిర్వహణ ఎలా సాధ్యమని కూడ ప్రశ్నించారు.
జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులేనా —–ఏపీటీఎఫ్ ప్రకాశం జిల్లా
09
Oct