పొగాకు బోర్డు ద్వారా అందిస్తున్న ఎరువులను ఉపయోగించుకోవాలని గుంటూరు పొగాకు బోర్డు విస్తరణాధికారి దామోదర రావు అన్నారు. పొగాగు బోర్డు వేలం కేంద్రం -23 పరిధిలో సోమవారం రైతులకు ఎరువులను అందించారు. బోర్డు రీజనల్ మెనేజర్ ఎం లక్ష్మణరావు మాట్లాడుతూ… పొగాకు సాగు చేయు రైతులు ఎరువుల కోసం నమోదు చేసుకున్న తర్వాత బ్యారన్ రెన్యువల్ చేయించుకుని ఎరువులు తీసుకువెళ్లాలని కోరారు. ఫ్యాక్ట్ వారి అమ్మెనియం సల్ఫేట్, ఐపీఎల్ వారి డీఏపి, ఎస్ఓపి ఎరువులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి రామక్రిష్ణ, బోర్డు మెంబర్ పి. వర ప్రసాద్, రైతు నాయకులు వి వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
