లక్కవరంలో జగనన్న సురక్ష వైద్య శిబిరం నిర్వహణ

ప్రతి పేదవాడికి మెరు గైన వైద్య సేవలు అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని వక్తలు అన్నారు. తాళ్లూరు మండలంలోని లక్కవరంలో గురు వారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిం చారు. తూర్పుగోదావరి పిహెచ్సి వైద్యాధికారి రత్నం ఆధ్వర్యంలో వైద్య బృందం 422 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 79 మం దికి కళ్ల పరీక్షలు చేసి వారిలో 38 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ మం డల అధ్యక్షుడు టి.వి సుబ్బారెడ్డి ,సర్పంచ్ నన్నం వరలక్ష్మి, ఎంపీ టీసీ సభ్యురాలు రావినూతల వెంకటమ్మ, వైద్యులు మౌనిక, రాజేష్ యాదవ్, లీనా, అరుణకుమారి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *