ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు
ఒంగోలులో ఆయన కార్యాలయంలో ఘనంగా అభిమానులు మధ్య నిర్వహించారు. వైఎఎస్సార్సీపీ తాళ్లూరు మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డికి, మాగుంట రాఘవ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐ.వి సుబ్బారెడ్డి , తాళ్ళూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి , మాజీ ఎంపీపీ కోట రామిరెడ్డి గారు,ఎంపీటీసీ ప్రభుదాస్ ,ముండ్లమురు మండల వైస్ ఎంపీపీ బంకా నాగిరెడ్డి , దోసకాయలపాడు సర్పంచ్ కోట శివలక్ష్మీ వెంకటరామిరెడ్డి , సింగన పాలెం సర్పంచ్ గీతాంజలి ,ముండ్లమూరు మండల మాజీ సర్పచులు సంఘం అధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి ,లక్కవరం మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి , కోటిరెడ్డి ,లక్కిరెడ్డి సుబ్బారెడ్డి,కైపు అశోక్ రెడ్డి, మరియు దర్శి నియోజకవర్గ మాగుంట అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.


