జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలలో భాగంగా గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను రిమ్స్ వైద్యులైన ఫైరోజ్ అన్వర్, ప్రియాంక, బి మధు శంకర్, సిహెచ్ ప్రవీణ్ కుమార్, వి జ్యోతి , ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు లను పోలవరం గ్రామ సర్పంచి నంబూరి లీలమ్మ యేసు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య నిపుణులైన రిమ్స్ వైద్యాధికారులచే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మేర మందులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ఇలాంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ వెంకటరావు, హెచ్ ఈ కే ఏ రాజు, హెచ్ వి కే అంజమ్మ, హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, ఏఎన్ఎం ఇందిరా ప్రియదర్శిని, ఎంఎల్ఓ భీమిరెడ్డి నాగమల్లేశ్వర్ రెడ్డి, ఎం ఎల్ హెచ్ పి కే శశి, కే జయశ్రీ, ఎం శరణ్య, వి కిరణ్, వి రాజేశ్వరి, బి రత్నకుమారి, ఎం దీప్తి, ఆషాలు తదితరులు పాల్గొన్నారు.





