దర్శిలో మానవతా స్వచ్ఛంద సంస్థ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ రామచంద్రారెడ్డి తెలిపారు. దర్శి ఎంపీడీవో సమావేశ మందిరంలో సేవాసంస్థ ప్రారంభోత్సవ కార్య క్రమం ఆదివారం నిర్వహించారు. యుటిఎఫ్ సంఘ బాధ్యుడు ధనిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 45 వేల మంది సభ్యులతో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ పెట్రోల్ బంక్ ఓనర్ మువ్వల పార్ధసారధి, వెంకటాపురం హై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రకాశరావు, అడ్వకేట్ సుధాకర్ రెడ్డి, యూ.టి.ఎఫ్ అధ్యక్షులు మీనిగ శ్రీను, నాగేశ్వరావు, రామారావు, వికలాంగుల సంఘము అధ్యక్షులు ఓబయ్య, పెన్షనర్ సంఘము అధ్యక్షులు వెంకటరెడ్డి, కొండయ్య శెట్టి పాల్గొన్నారు.పాల్గొన్నారు.
