క్రీడలతో మానసికోల్లాసం-వైఎస్సార్-బీఎస్సార్ మెగా క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కోస్టల్ రైడర్స్ టీం ఓనర్, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. విజయ దశమి పండగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వైఎస్సార్-బీఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. అందులో భాగంగా మొదటి బహుమతి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రూ.111116 నగదు ఫైనల్ విజేత గణేష్ వారియర్స్ కి అందజేయగా ద్వితీయ బహుమతి విజేత చందు లెవెన్స్ కి దర్శి మండల సర్పంచ్ ల సంఘ అధ్యక్షుడు, బసిరెడ్డి పల్లె సర్పంచ్ కేసరి రాంభూ పాల్ రెడ్డి రూ.60 వేల నగదు బహుమతి అందజేశారు. తృతీయ బహుమతి అంజి పాంథర్స్ కి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కేవీరెడ్డి రూ.40 వేలు, నాలుగో బహుమతి సింహా లెవెన్స్ కి తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూధన్ రెడ్డి రూ.20 వేలు అందజేశారు. టోర్నమెంట్ షీల్డ్ను సారెడ్డి సుధాకర్ రెడ్డి అందజేశారు. బూచేపల్లి వెం కాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ…. క్రీడా కారులు గెలుపోటములను సమానంగా తీసుకో వాలని సూచించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, పార్టీ జిల్లా వైద్య విభాగం ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృ ష్ణారెడ్డి, సోషల్ మీడియా కో కన్వీనర్ యరమల మధుసూదన్ రెడ్డి, సందిరెడ్డి రాజశేఖరరెడ్డి, మేకల కృష్ణారెడ్డి, వాకా స్వరూప్ రెడ్డి, కాసు శ్రీనివాసరెడ్డి, వెన్నపూస బాపిరెడ్డి, చంద్రగిరి గురవారెడ్డి, బంకా నాగిరెడ్డి, కొల్లా భాస్కర్, పానుగంటి కోటేశ్వర రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *