తెగుళ్లతో అప్రమత్తంగా ఉండాలి – తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు

తాళ్లూరు మండలంలో మిరప సాగు చేసిన రైతులు తెగుళ్లతో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. మండలంలోని రజానగరం, తాళ్లూరు గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 924 ఎకరాల్లో మిరప సాగు చేసినట్లు పేర్కొన్నారు. మిరప సాగులో ఎకరాకు 100 బంతి, కొత్తిమీర, ఉల్లి, ఆముదం మొక్కలు నాటాలన్నారు. తద్వారా తెల్లదోమ, తామర పురుగుల నుంచి బెడద తగ్గు తుందన్నారు. తెగుళ్ల నివారణకు వేప నూనె పిచికారీ చేసుకోవాలన్నారు. ఆయన వెంట వీఏఏలు నాగరాజునాయక్, అశోక్ లు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *