పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ (ఆర్ ఎం) లక్ష్మణరావు అన్నారు. స్వచ్చత అభియాన్ -3లో బాగంగా శుక్రవారం పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో పొగాకు బోర్డు సాగు చేయు రైతులకు, బోర్డు మెంబర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం లక్ష్మణరావు మాట్లాడుతూ …పచ్చదనం పెంపకంతో పర్యావరణ సమతుల్యత సాధ్యమని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ఖాళీ ప్రదేశాలలో సైతం మొక్కలు విరివిగా నాటాలని సూచించారు. బోర్డు ఆవరణలో మొక్కలు నాటారు. రైతులకు మొక్కలు పంపిణీ చేసారు. వేలం నిర్వాహణాధికారులు ఎం రవికాంత్, సత్య శ్రీనివాస్, తులసి, బోర్డు మెంబర్లు వర ప్రసాదరావు, బ్రహ్మయ్య, శేషయ్య, నరసింహం పాల్గొన్నారు.

