ప్రజా స్వామ్యానికి విలువ ఇవ్వాలి – బిజేపి రాష్ట్ర మీడియా ప్రతినిథి ఉన్నం నళిని

ప్రజా స్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ఉందని వ్యక్తిగత ద్వేషం, దూషణలతో రాజకీయం చేయటం తగదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా (ప్యానలిస్ట్) ప్రతినిథి ఉన్నం నళిని అన్నారు. ఒంగోలు బీజేపి కార్యాలయంలో సోమవారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు వ్యక్తిగత ద్వేషాలు మనసులో పెట్టుకుని పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై దూషనలకు దిగటం తగదని వాపోయారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనకుండా ప్రత్యేక ఎన్నికలలో ప్రజల మన్ననలు పొందిన పురందేశ్వరిపై ఆరోపణలు చేయటం తగదని హితవు చెప్పారు. మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి వీరందరూ ఎంతో అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారని ఆ బూతులకు అర్ధాలు తెలిపే నిఘంటువులను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీలో లేని వ్యక్తిని, అది మహిళను అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలంతా విన్నారు. ఇది గమనిస్తున్నారు . రాబోవు రోజులలో పురందేశ్వరిపై లేని పోని ఆరోపణలు చేస్తే బిజేపి కార్యకర్తలు తగిన విధంగా స్పదిస్తారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిథులు బొద్దులూరి ఆంజనేయులు, ఎనుముల నాగేశ్వరరావు, జాడి వెంకట నారాయణ, జిల్లా మీడియా ఇన్ఛార్జి ధనిశెట్టి రాము నాయుడు, జిల్లా కార్యదర్శి బసినే పల్లి రాజశేఖర్, ఒబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కుంచాల వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు తదితరులు, గిద్దలూరు నియోజక వర్గ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *