రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యకరమైన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అం దిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ అన్నారు. దర్శి మండలంలోని తూర్పు చౌట పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం వెంకాయమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. ఎలా చదువుతున్నారు? అధ్యాపక సిబ్బంది సరిగా వస్తున్నారా? పాఠ్యాంశాలు అర్థమ వుతున్నాయా? జగనన్న విద్యా కానుక అందిందా ? ఆహారం రుచి కరంగా ఉంటుందా అని అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలసి కూర్చుని భోజనం చేశారు. శామంతపూడి గ్రామానికి చెందిన 40 మంది విద్యార్థులు బస్ సౌకర్యం లేక నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని బస్ వేయించాలని కోరగా వెంటనే శామంతపూడి నుంచి బసేయాలని ఆర్టీసీ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి చెప్పారు. పాఠశాల గ్రౌండ్ చివర భూమిని శ్మశానంగా వాడుకుంటున్నారని, దీంతో పిల్లలు ఆడుకోవాలంటే భయపడుతు న్నారని వారి దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కరి స్తానని హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయ సిబ్బంది తమకు సీసీరోడ్డు వేయాలని వినతి పత్రం అంద జేశారు. త్వరలోనే సీసీ రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెం కాయమ్మ మాట్లాడుతూ… నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టి పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు కాకర్ల రఘురామయ్య, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






