మేలైన యాజమాన్య పద్ధతులతో మంచి దిగుబడులు పొంద వచ్చని ఆత్మ పీడీ అన్నపూర్ణ అన్నారు. చీమకుర్తి మండలం పాటిమీద పాలెంలో సోమవారం రైతులకు పాలం బడి కార్యక్రమం నిర్వహించారు. వరి, మిరప పొలాలను పరిశీలించారు. | పొలం బడికి ఎంపికయిన రైతులకు శిక్షణ ఇచ్చారు. వరిలో సాగు పద్ధతులు, ఆశించి తెగుళ్లు గమనించి, నివారణ చర్యలను వివరించారు. మిరపలో తామర పురుగు ఉదృతి ఉన్నట్లు గమనించి జిగురు అట్టలు ఎకరానికి 20 చొప్పున ఏర్పాటు చెయ్యాలని సూచించారు. పురుగు మందుతో పాటు వేప నూనేను కలపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించి ప్రకృతి వ్యవసాయం, సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. డిఆర్సీ వ్యవసాయాధికారి వివి శేషమ్మ, మండల వ్యవసాయాధికారి డివీ భాస్కర్, విఏఏ శృతి పాల్గొన్నారు.




