తాళ్లూరు మండలంలోని నాగం బొట్లపాలెంలో గల స్వయంభు వీర నరసింహ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. వేద పండితులు ముందుగా విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలు ప్రారంభించారు. తదుపరి పుణ్యాహవచనం, పంచగవ్య ఆరా ధన, అఖండ స్థాపన, రుత్వికరణ, యాగశాల ప్రవేశం, అర్చన, నివేదన, హారతి, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిం చారు. ఉభయ దాతలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో గ్రామస్థులు పాల్గొన్నారు.


