తాళ్లూరు మండల కేంద్రమైన తాళ్లూరుకు చెందిన ఓయువకుడు
ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లూరు గ్రామానికి చెందిన ఆవుల సర్వేశ్వరరెడ్డి(16) పదవ తరగతి వరకు చదువుకున్నాడు. గత ఏడాదిపది పాసై ఇంటర్ చదవక ప్రస్తుతం ఇంటి వద్దే వుంటున్నాడు. గురువారం మధ్యాహ్న సమయంలో గడ్డి మొక్కల నివారణకు కొట్టే గడ్డిమందును త్రాగాడు. గడ్డి మందు తాగటం వల్ల పరిస్థితి విషమంగా వుండటంతో ఒంగోలుకు తీసుక వెళ్లి వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సర్వేశ్వరరెడ్డి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
స్నేహితులు అయ్యప్పస్వామి మాలలు వేస్తుండగా తాను వేసుకుంటానని కుటుం బసభ్యులను అడుగగా ఒప్పుకోక పోవటం ఒక కారణగా చెబుతున్నారు. చదువుకు దూరమైన యువకుడు వ్యసనాలకు బానిసై ఓయువతి ప్రేమలో పడి విఫలయత్నం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
