మన్నేపల్లి సొసైటీ చైర్పర్సన్ గా జయరామిరెడ్డి నియామకం

తాళ్లూరు మండలంలోని మన్నేపల్లి సొసైటీ చైర్ పర్సన్ గా కుమ్మిత జయరామిరెడ్డిని నియమిస్తూ రాష్ట్రఅగ్రికల్చర్ కార్పోరేషన్ శాఖగురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తురకపాలెంకు చెందిన జయరామిరెడ్డి వైఎస్ఆర్సిపి లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కుమ్మిత జయరాం రెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ పరిధిలోని రైతుల అభ్యున్నతికి తనవంతు సహకారం అందిస్తాను తెలిపారు. తననియామకానికి సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్ఆర్సిపి తాళ్లూరు మండల ఇంచార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ,జడ్పీటీసీ Msgs వెంకటరెడ్డి లకు అభినందనలు తెలిపారు. దర్శిలో శుక్రవారం తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రను, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి కలసి ఘనంగా సన్మానించారు. స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, గంగిరెడ్డిపాలెం యలమందా రెడ్డి జయరాం రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *