నాగంబొట్లపాలెంలో భక్తి శ్రర్థలతో శ్రీ స్వయంభు వీర నరసింహా స్వామి జీవ ద్వజ స్థంభ విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవం

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబొట్ల పాలెంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో శ్రీ స్వయంభు వీర నరసింహ స్వామి జీవ ద్వజ స్థంభ విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కొండపై ఎంతో అహ్లాద కరంగా ప్రకృతి పరవసించే విధంగా దేవాలయాన్ని గ్రామస్తులు, భక్తులు తీర్చిదిద్దారు. నవంబర్ 1 నుండి పలు ప్రత్యేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించి శుక్రవారం నిత్యవిధులు, గర్తపూజ, రత్న న్యాసం, ధాతు వ్యాసం సుముహుర్తమునకు అనగా పునర్వసు నక్షత్రయుక్త, ముక్తా ధనుర్లగ్న పుష్కరాంశమునకు యంత్రస్థాపన, తతుపరి విమానశిఖర ప్రతిష్ఠ తదుపరి విగ్రహ ప్రతిష్ట, విప్ర ధేను, దర్పణ, కన్య, తృణాగ్ని, కూష్మాండ ఛేదన, మహోదన, దశవిధ దర్శనములు, తదుపరి మహా కుంభాబి షేకములు, మహాపూర్నాహుతి, అలంకరణ, దేవతా దర్శనము, యజ్ఞ పాయస వితరణ, బుత్విక్ సన్మానములు, మహాశీర్వచనములు, కంకణ విమోజనలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పూనూరుకు చెందిన ప్రధాన బుత్వికులు మూలం రాజు రాజు కుమార్ శర్మ (పూనూరు రాజ శర్మ శైవ గామ, సర్వ దేవతా ప్రతిష్టా చార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ అన్నదానం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *