దర్శి నియోజకవర్గం అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ద చూపి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి

దర్శి నియోజకవర్గం అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ద చూపి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి సూచించారు. దర్శి మండల పరిషత్ కార్యాలయములో నియోజకవర్గ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం శనివారం జరిగింది.
ఈ సందర్భంగా హాజరైన సర్పంచ్ లు, యం.పి.టి.సి లు తమ తమ గ్రామాల్లో సమస్యలపై జరగాల్సిన పెండింగ్ పనులను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శన్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక వహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో త్రాగు నీరు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గంలో పలు కారణాల వలన ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ లు, యం.పి.టి.సి లు కోరిన పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. దర్శి పట్టణంలో ఇంటింటికీ కుళాయి పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు. గంగవరం-తాళ్ళూరు రోడ్డు పనులు, కురిచేడు- పొట్లపాడు ఆర్ అండ్ బి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎస్సీ, బి.సి., కాలనీలలో విద్యుత్ పోల్స్ అవసరం అయితే జెడ్పి నిధులతో మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు చెప్పిన ప్రతి పనిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పెండింగ్ లేకుండా చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసి కాలనీలలో లో వోల్టేజ్ సమస్యలు ఉన్న చోట విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్లు వేయాలని ఆదేశించారు. జగనన్న కాలనీలలో తమ సొంత ప్లాట్లలో ప్రభుత్వం అందిస్తున్న నివాసాలు ఏర్పాటు చేసుకునే వారికి అధికారులు తమకు కావాల్సిన ఇసుక, సిమెంట్ వంటి మెటీరియల్ లు, వారికి చెల్లించాల్సిన బిల్లుల్లో లోపాలు అధికమించి నివాసాలు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఆర్. డబ్ల్యుయస్ ఎస్. ఈ మర్ధాన్ఆలీ, ఈ. ఈ శ్రీనివాస రావు, డి. ఈ రంగారావు ఆర్ అండ్ బి డీ. ఇ కృష్ణ, పంచాయతి రాజ్ డి. ఈ విటల్ రాధోడ్, విద్యుత్ ఈ. ఈ షేక్ కరీమ్ , డి. ఈ పిచ్చయ్య, ఎంపీపీ సుధా అచ్చమ్మ, షేక్ కార్పోరేషన్ డైరెక్టర్, వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, వైస్ ఎంపీపీలు కొరివి ముసలయ్య, సోము దుర్గారెడ్డి, ఎంపీడీవో హనుమంత రావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు కేసరి రాంభూపాల్ రెడ్డి, మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *