పొగాకు రెలింగ్, క్యూరింగ్ లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ అన్నారు. ఒంగోలు-2 పరిధిలోని పోతవరం, అనబ్రోలు వారి పాలెం, ఎన్జపాడు, టి అగ్రహారం, ఉప్పలపాడు, మద్దిరాల పాడు గ్రామాలలో పొగ తోటలు, బ్యారన్లు, గ్రెడింగ్లను రైతు మిత్ర బృందంలోని వేలం నిర్వాహణాధికారులు కోవి రామక్రిష్ణ. తులసి, రామాంజనేయులు, ఐటీసీ మెనేజర్ యశ్వంత్ కుమార్, ఎఓఐ సభ్యులు వెంకటేశ్వర్లు పరిశీలించారు. రైతులు పొగాకు ఆకు రీల్స్ అల్లు సమయంలో తప్పనిసరిగా టార్పలిన్ ఆకుపై కప్పుగా మరియు ఆకుల క్రింద వెయ్యాలని, గ్రెడింగ్ చేసే సమయంలో పొగాకు అన్య పదార్థాలు, గడ్డి పీచులు, బైడింగ్ వైరులు, ప్లాస్టిక్ రాకుండా చెయ్యాలని కోరారు. రైతులు పండిన ఆకులను రేల్చి క్యూరింగ్ చేసుకోవాలని చెప్పారు.


