ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దేశ ప్రజలకు, దేశాభివృద్ధికి ఎన్నో పథకాలను రూపొందించి వాటిని అమలు చేస్తున్నారని ముఖ్యంగా బాలికలకు, మహిళలకు వారి భవిష్యత్తు, ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి బేటి బచావో బేటి పడావో పేరిట పుట్టినప్పటి నుండే బాలికల ఉన్నతికి, సుకన్య సమృద్ధియోజన, మహిళలకు, గర్భిణీ స్త్రీలకు మాతృ వందన యోజన, మిషన్ వాత్సల్య, మహిళా శక్తి కేంద్ర, పోషణ అభియాన్ మరియు కౌమార బాలికల కోసం పథకం, స్వధార్ మరియు ఉజ్వల పధకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని, ఇలా పలు పథకాలను అమలు చేస్తూ ఉన్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక గాంధీనగర్ పోస్ట్ ఆఫీస్ లో తీగల సత్యవతి ఇధ్వర్యములో పలువురు చిన్నారులకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిపించి పాస్ బుక్ లను అందించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ జి.వి కృష్ణ రావు, జి మాధవి, పోస్టల్ ఏజెంట్ నరసింహారావు, నరసయ్య, శరాద, రుత్విక తదితరులు పాల్గొన్నారు.
