తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెంలో బుధవారం మన ఊరికి మన శివన్న కార్యక్రమం నిర్వహిం చనున్నట్లు వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ కార్యాలయ ఇన్చార్జి సందిరెడ్డి నరేంద్రరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచే పల్లి శివప్రసాదరెడ్డి, దర్శి నియోజకవర్గ వైఎ స్సార్ సీపీ ఇన్ఛార్జ్, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
నేడు నాగం బొట్ల పాలెం లో మన ఊరికి మన శివన్న కార్యక్రమం
07
Feb