రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జెండాలు ఎన్ని కలిసినా జగనన్న ఎజెం డా ముందు నిలవ లేవని, జగనన్నే సీఎం అని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఇన్ చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని అయ్యలపాలెం, నాగంబొట్లపాలెం గ్రామాల్లో బుధవారం రాత్రి మన ఊరికి-మన శివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మొదట గ్రామంలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నందిని, శివప్ర సాదరెడ్డిలు ప్రధాన వీధుల్లో మహిళలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు హారతులు, పూలతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రచార రథంపై వారు మాట్లాడుతూ నాగంబొట్లపాలెం గ్రామానికి తమ కుటుంబానికివిడదీయరాని బంధం ఉందన్నారు. తమ సొంతూరులా ఎప్పుడు వచ్చినా అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారన్నారు. 2004, 2009లో వైఎస్సార్ ఆశీస్సులతో తమ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేగాఆదరించి గెలిపించారని, 2024లో జగనన్న ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకువస్తున్నానని, మంచి మెజార్టీతో గెలిపించాలనికోరారు. దేశంలోనే మాట మీద నిలబడి ఎన్నికలమేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.మామను వెన్నుపోటు పొడిచి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయని నారా చంద్రబాబునాయుడు మరోసారి దొంగ హామీలతోమీ ముందుకు వస్తున్నాడని, నమ్మి మోసపోవద్దన్నారు. చంద్రబాబు పాలనఅంతా కరువు మయమని, వర్షాలు లేక చుక్క నీరు కూడా దొరకదన్నారు. బూచేపల్లి కుటుంబానికి కులమతాలులేవని, తమ వెంట నడిచేవారంతా తమ వాళ్లేననితెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అన్నిరంగాల్లో ఇచ్చిన ఘనత వైఎస్ కే దక్కిందని వెంకాయమ్మ అన్నారు. పేద, బడుగు,బలహీన వర్గాల కోసం అమలవుతున్న సంక్షేమపథకాలు మన ఇంటికే చేరాలంటే జగనన్న కోసంసైనికుల్లా పని చేద్దామన్నారు. ప్రతి ఇంటికి చేకూరిన లబ్దిని బ్యాంకు ఖాతాలే తెలియజేస్తాయన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ఏకైక లక్ష్యం175/175 అని, మీ బిడ్డగా ఇంటింటికీ వస్తున్న శివప్రసాదరెడ్డిని గెలిపించాలని కోరారు. గ్రామాల్లోనిపలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.హాజరైన వారందరికీ అన్నదానం చేశారు. ఆయాకార్యక్రమాల్లో సర్పంచ్ చిమట సుబ్బారావు, ఎంపీటీసీ వీరయ్య , మాజీ సొసైటీ అధ్యక్షులు శనివారపు శ్రీనివాసరెడ్డి ,విజిలెన్స్ కమిటీ సభ్యులు సోము అనిల్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు తూమువెంకట సుబ్బారెడ్డి, చిన్నపరెడ్డి మస్తాన్ రెడ్డి, జిల్లాకో ఆప్షన్ సభ్యుడు షేక్ ఆదాం షరీప్, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి,విజిలెన్స్ కమిటీ సభ్యులు సోము అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, కోటా రామిరెడ్డి,గోళ్లపాటి మోషే, మాజీ ఎంపీటీసీ రాజు, మాజీజెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా యూత్‌ప్రధాన కార్యదర్శి భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి,మాజీ ప్రధాన కార్యదర్శి జక్కుల రామకృష్ణ, మండల ఎస్సీసెల్ కార్యదర్శి పూనూరి దేవదానం,మాజీ ఏఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు యాడిక యలమందారెడ్డి, జయరామిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పులి ప్రసాదరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు ఛార్లెస్ సర్జన్, మందా శాంసన్, , కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సంక్షేమ రాజ్యం జగనన్నతోనే సాధ్యం -
సంక్షేమ రాజ్యం ముఖ్యమంత్రివైఎస్ జగనన్న తోనే సాధ్యమని జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు.
దర్శి లంకోజనపల్లి రోడ్‌లోని పదో వార్డులోబుధవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఆయన సతీమణి నందినిఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు నమస్కారం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శివప్రసాదరెడ్డిని గెలిపించాలని కోరారు. బూచేపల్లికుటుంబం 20 ఏళ్లుగా నిస్వార్థంగా దర్శి ప్రజలకుసేవచేస్తూ అండగా నిలిచామన్నారు. ఎవరికి ఎలాంటిఆపదవచ్చినా ఆదుకుంటున్నామని తెలిపారు. మాకుటుంబంపై నమ్మకంతో జగనన్న వైఎస్సార్సీపీఅభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని నియమించినందున మీలో ఒక బిడ్డగా, సోదరుడిగా ఆదరించిత్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసిగెలిపించాలని అభ్యర్థించారు. ఇస్త్రీ చేసి మీ కష్టాలనుతీర్చేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు.ఆటోలలో కూలి పనులకు వెళ్తున్న కూలీలు బూచేపల్లి వెంకాయమ్మ, నందిని లను చూసి ఆప్యాయంగా పల కరించారు. కార్యక్రమంలో కాపా రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంక టరెడ్డి ,షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, ఎంపీపీ సుధా అచ్చయ్య, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూడి దేవ ప్రసాద్, బీసీ సెల్ జిల్లా సెక్రటరీ చెరుకూరి జగన్మో హన్‌రావు, , పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, పాశం జయసింహ, పసుపులేటి గురవయ్య, శేషయ్య ఆరేటి సురేష్, సందిరెడ్డి వెంకటరెడ్డి, రాజశేఖరరెడ్డి, తాతిరెడ్డి కొండారెడ్డి, పానుగంటి మోహనరావు, మాజీ జెడ్పీ టీసీ దామెర్ల రమణచంద్ర, మాజీ ఎంపీపీ ఇత్తడిదేవదానం, కౌన్సిలర్లు జగన్నాథం మోహనబాబు,మేడం మోహన్‌రెడ్డి, తుళ్లూరి బాబురావు, కర్ణాభాస్కరరెడ్డి, మజ్ఞువలి, పుట్టా రవి, సోషల్మీడియాకోఆర్డినేటర్ యరమల మధురెడ్డి, గ్రీన్ అండ్బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఐఆర్సీఎస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి, ప్రచార కమిటీ జిల్లా కార్యదర్శి బొమ్మిరెడ్డి అంకబాబు, నాయకులు ఎదురునారాయణరెడ్డి, కర్ణా వెంకటరెడ్డి, బండారు బాబు,కొడవటి జాన్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి,పానుగంటి కోటేశ్వరరెడ్డి, భాస్కరరెడ్డి, చెవిరెడ్డి రాజారెడ్డి, వేమిరెడ్డి నాగ ప్రసాదరెడ్డి, వెన్నపూస చెన్నారెడ్డి,యన్నం సుబ్బారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధైర్య పడొద్దు.. అండగా ఉంటా!
వైఎస్సార్ సీపీ కోసం కష్టపడి పని చేసి అనారోగ్యంతో బాధపడుతూఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి భరోసా ఇచ్చారు. దర్శి మండలంలోని యర్రఓబనపల్లి, అగ్నిపురి కాలనీ గ్రామాల్లో
బుధవారం పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. యర్రఓబనపల్లి గ్రామానికి చెంది అనారోగ్యంతో బాధపడుతున్న పేరం వెంకటరెడ్డిని, ప్రమాదంలో గాయపడిన కైపు బ్రహ్మారెడ్డిని, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేరం బాలనాగిరెడ్డిలను పరామర్శించి ఓదార్చారు. చీమలదిన్నె వెంకటస్వామి, బేళ్ల పరమేష్, మెలికాశ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అగ్నిపురి కాలనీకి చెందినగూడూరి విక్టోరియా, గుంటూరి వెంకటేష్,మురికిపూడి శాంసన్, భాగ్యరాజు, గుంటూరి ఎలీ
శమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
రామిరెడ్డికి బూచేపల్లి పరామర్శ
దర్శి పట్టణంలోని కొత్తపాలెంలో వెన్నపూస రామిరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి అనారోగ్యంతో బుధ వారం మృతి చెందాడు. సమాచారం తెలుసు కున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి అక్కడికి చేరుకొనిసుబ్బారెడ్డి మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామిరెడ్డికి ధైర్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ కైపు నాగేశ్వరమ్మ సుబ్బారెడ్డి, నాయకులు బాదం రమణారెడ్డి, చీమలదిన్నె కొండయ్య, గుంటూరి విల్సన్, సమాధానం పాల్గొన్నారు.