తాళ్లూరు మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా కందులను కొనుగోలు చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు అన్నారు. తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ మందా శాంసన్ అధ్యక్షతన కందుల కొనుగోలు బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏవో ప్రసాదరావు మాట్లాడుతూ …ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా 2023 -24 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో పండించిన కందులను నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కందులకు సంబంధించిన నగదు కొనుగోలు చేసిన 15 రోజుల లోపే బ్యాంకులో నేరుగా జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కందుల కొనుగోలు బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఏఈఓ నాగరాజు, కృష్ణారెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు అజ్మీర్ పాల్గొన్నారు.

