నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి రాష్ట్ర బోర్డు డైరెక్టర్ గా సానికొమ్ము తిరుపతి రెడ్డిని నియమించారు. ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్ ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసారు. ఈమేరకు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ..తనకు రాష్ట్ర స్థాయి పదవి రావటానికి సహకరించిన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఎన్ఆర్ఆడిసీఏపీ రాష్ట్ర బోర్డు డైరెక్టర్ గా నియమితులైన సానికొమ్ము తిరుపతి రెడ్డిని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.


