దీర్ఘకాలం పోరాటం తర్వాత ఎట్టకేలకు వెలుగువారిపాలెం ప్రాధమిక పాఠశాల (ఎఎ)కు చెందిన స్థలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారులు ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఆక్రమణల తొలగింపునకు కృషిచేసిన జిల్లా కలెక్టర్, అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

