ఎపీఐఐసీ కార్పోరేషన్ చైర్మన్ గా జంకె వెంకట రెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్టెక్చర్ కార్పోరేషన్ (ఎపీఐఐసీ) చైర్మన్ గా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకట రెడ్డి ని నియమిస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వకార్యదర్శి ఎన్ యువరాజ్ జీఓ నంబర్ 26ను విడుదల చేసారు. జంకె వెంకటరెడ్డి 1994 నుండి 99 వరకు ఎమ్మెల్యేగా, 2014-19 వరకు రెండవ దఫా మార్కాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నాయి. విశ్వస నీయతకు, నిజాయితీకి మారు పేరుగా జంకె వెంకట రెడ్డిని అభిమానులు భావిస్తుంటారు. నమ్ముకున్న వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తారనే దానికి ఈ పదవే నిదర్శనమని పార్టీ అభిమానులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు. జిల్లాలో వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన పర్యటిస్తూ కృషి చేస్తున్నారు. కీలకమైన రాష్ట్ర స్థాయి పదవి జంకేను వరించటం పట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *