శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడబోనని జిల్లా నూతన ఎస్పీపి.పరమేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అందరి సహకారంతో జిల్లాను నేర రహితంగా నిలిపేందుకు, పోలీసులుసేవాభావంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకుకృషి చేస్తానని చెప్పారు. జిల్లా నూతన ఎస్పీగా పి.పరమేశ్వరరెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి నుంచి వచ్చిన ఎస్పీ.. తొలుత జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ని గెస్ట్ హౌస్ కుచేరుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కే నాగేశ్వరరావుతో పాటు ఇతర అడిషనల్ఎస్పీలు, జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) సిబ్బందినూతన ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 6.35 గంటలకుఆయన బాధ్యతలు చేపట్టారు. నూతన ప్రకాశం జిల్లాఏర్పడిన తర్వాత జిల్లాకు రెండో ఎస్పీగా పరమేశ్వరరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగాఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన ప్రణాళికతో,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. జిల్లాలోని క్రైమ్ తీరుపై లోతుగా చర్చించి మెరుగైన పోలీసింగ్ అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. జిల్లాపై పూర్తి స్థాయిలో అవగాహన సాధించి అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తానని వివరించారు. సిబ్బంది సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ప్రజా సమస్యలు పరి ష్కరించేందుకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఎస్పీకి ఘనస్వాగతం…
నూతన ప్రకాశం జిల్లా తొలి ఎస్పీగా మలికాగర్గ్ పనిచే శారు. ఆమె 2 సంవత్సరాల 7 నెలల పాటు విధులు నిర్వర్తించారు. అదేవిధంగా తిరుపతి నూతన జిల్లా తొలి ఎస్పీగా పి.పరమేశ్వరరెడ్డి 2022 మే 14వ తేదీ బాధ్యతలు చేపట్టారు. మలికాగర్గ్ ను తిరుపతి ఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులిస్తూనే.. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న పి.పరమేశ్వరరెడ్డిని జిల్లాకు బదిలీ చేశారు. ఈ మేరకు ఈ నెల 1వ తేదీ జీఓ ఆర్ట్ నంబర్-239 విడుదల చేశారు. 2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన పి. పరమేశ్వ రరెడ్డి రెండేళ్ల పాటు సీఎం వైఎస్ జగన్ కు చీఫ్ సెక్యూ రిటీ ఆఫీసర్ (సీఎస్ఓ)గా పనిచేశారు. 2022 మే 14వ తేదీ సీఎస్ఓ నుంచి తిరుపతి ఎస్పీగా బదిలీపై వెళ్లారు. అక్కడ మంచి ప్రశంసలు పొందారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వరరెడ్డికి జిల్లాలోని పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వారిలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎస్పీ శ్రీధర్ రావు , ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్బాబు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
