పోలీస్ స్టేషన్ లో కి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజా పాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషన రేట్ పరిధిలోని కొన్ని పీఎస్ ల లో అమలవుతున్న నిబంధన. ఒకవైపు డయల్ 100కు ఫోన్ చేసినా.. పట్టించుకోని పోలీసులు.. మరో వైపు ఠాణాల్లోకి పాత్రికేయులు రావొద్దంటూ హుకుం జారీ చేస్తు న్నారు. వెస్ట్ జోన్ పరిధిలో ఈ నిబంధన అమలవుతున్నది. డీసీపీయే స్వయంగా జర్నలిస్టులను రావద్దని చెప్పారని, ఆ ఆదేశాలను అమలు చేస్తున్నామంటూ.. కొందరు పేర్కొంటున్నారు. మధు రానగర్ పీఎస్ లో కి రిపోర్టర్లను అనుమతించమని, తమకు ఉన్న తాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలని, మా ఇన్స్పెక్టర్ అమలు చేయ మన్నారంటూ.. ఓ కానిస్టేబుల్ చెప్పి తిరిగి పంపిస్తున్నారు.
ఠాణాల్లో జర్నలిస్టులకునోఎంట్రీ
13
Feb