వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కి పట్టం కడితేనే భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులోని కోతమిషన్ బజారు, శివరాజ్ నగర్ ల లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కురిచేడు రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ వెంకాయమ్మతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం ఉంటుందని అన్నారు. ఈ ప్రచారంలో బూచేపల్లి కి మహిళలు ఆయనకు హారతులు పట్టి స్వాగతం పలికారు. దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్పొరేషన్ డైరక్టర్లు ఎస్ఎం బాషా, కుమ్మిత అంజిరెడ్డి, సోము దుర్గారెడ్డి, పట్టణ అధ్యక్షులు హరీష్, నాయకులు రెహమాన్, రవి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


