తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి కైపు వెంకట కృష్ణారెడ్డి గురువారం ఆయన నివాసంలో కలిశా రు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యువత చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై ఆయనతో ప్రస్తావించా రు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
