మొక్కజొన్నలో సరైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని పొంద వచ్చని తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరులో గురువారం జాతీయ ఆహార భద్రత మిషన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు యాజమాన్య పద్ధతులపై శిక్షణా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తూ మండల వ్యవసాయాధికారి బి ప్రసాద రావు మాట్లాడుతూ …మొక్కజొన్న పంట ఏనుగు పంట వంటిదని ఈ పంట ఎక్కువ నీటిని, ఎక్కువ పోషకాలను, వినియోగించుకొని పెరుగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ సూచనలను పాటించి పలు రకాలైన యాజమాన్య పద్ధతులను నిర్వహించినట్లయితే మొక్కజొన్నలో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, వెంకట రావు, మహిళా రైతులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు
