మోదీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మె చేస్తున్నామని సిఐటియు,ఎఐటియుసి దరిశి నియోజక వర్గ కార్యదర్శులు తాండవ రంగారావు, మాడపాకుల రమేష్ బాబు తెలిపారు.
సుందరయ్య భవనం నుంచి సిఐటియు , సిపియం కార్యకర్తలు , ఎఐటియుసి ఆఫీసు వద్ద నుంచి సిపిఐ కార్యకర్తలు ప్రదర్శన గా SBI , యూనియన్ బ్యాంకులు , LIC , ఫోస్టల్ , టెలికాం , పినాకీని , పంజాబ్ నేషనల్ బ్యాంకుల ఉద్యోగులను బయటకు పంపి తాళాలు వేశారు.
మోదీ , బిజెపి ప్రభుత్వం 2014 లో సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని, రైతుల అదాయం రెట్టింపు చేస్తామని, ఆకాశానికి నిత్యావసర ధరలు పెరిగి పోయాయని , ధరలను తగ్గిస్తామని, దేశాన్ని అభివృద్ది చేస్తామని చెప్పి ,అధికారం లోకి వచ్చి రైల్వే , బ్యాంకులు , LIC , టెలికాం , విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వ పరిశ్రమలను ప్రవేటికరణ చేస్తు కార్పోరేట్ లకు దేశ సంపదని దోచి పెడుతున్నారని , దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు గిట్టుబాటు ధరల చట్టం కోసం డిల్లీ లో పోరాడుతుంటే తుఫాకులు , లాఠీలు , నీటి పిరంగులతో దౌర్జన్యం చేస్తున్నారని ప్రజలంతా మోదీ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన , పోరాటాలు చేయాలని కోరారు.
ఈ సమ్మెలో కార్మిక , కర్షక నాయకులు ఉప్పు నారాయణ , రాగిపిండి రామ్ కోటిరెడ్డి, జూపల్లి కోటేశ్వరరావు , అంజయ్య , కరుణా నిధి , ఈమని నాగేశ్వరావు , జాన్ సామ్యేల్ , అంజిబాబు , కోటయ్య , ఇస్సాక్ , షేక్ కాలే భాషా , ఉప్పు మోహానరావు , అరుణా , తిరపతమ్మ , పాల్గొన్నారు.



