జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ ఆరోగ్యం

జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో అందరికీ ఆరోగ్యం చేకూరుతుందని సర్పంచ్ షేక్ వలి అన్నారు. తాళ్లూరు మండలం లోని మల్కా పురం గ్రామంలో శు క్రవారం రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు .గ్రామ సర్పంచ్ షేక్ వలి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామంలోని ఇంటింటికి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తిరుగుతూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాక అనారోగ్య బారిన పడిన వారికి తగిన వైద్య సదుపాయం అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ వారి ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నారని ఇది ప్రజలకు ఎంతో మేలును కలిగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య సురక్ష మందులను పంపిణీ చేశారు. తాళ్లూరు పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ ఎస్ కె ఖాదర్ మస్తాన్ బి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హేమాంజలి, జనరల్ సర్జన్ డాక్టర్ డేవిడ్ తదితరులు పాల్గొని 287 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి వైద్య సలహాలు ఇవ్వడమే కాక ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మేడగం వెంకట్రామిరెడ్డి, ఫార్మసిస్ట్ రమేష్ , ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *