చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించు కుని తూర్పుగంగవరం గ్రామంలో చిరుధాన్యాలతో 100 రకాల వంటలు- 100 వ్యాల్యుఏడెడ్మిల్లెట్ రెసిపీస్’ పుస్తకాలను ఆర్బీకే సిబ్బందికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ చిరుధాన్యాల వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలువున్నాయని, వాటిని వంటకాలుగా చేసుకుని పలు రకాలుగా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యం సమకూరుతుందన్నారు. ప్రతి మహిళ ఈ చిరుధాన్యాల వంటకాలపై దృష్టి పెట్టాలన్నారు. చిరుధాన్యాలైన జొన్నవంటకాల వల్లశక్తి, పెరుగుదల, మలబ ద్దకం నివారించ వచ్చునన్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులకు చక్కెర నివారణ, కొలెస్ట్రాల్ తగ్గించటం, గ్లూటిన్ఎలర్జీ, సీతియాన్ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహా రంగా ఉంటుందన్నారు. వంట తయారీకి కావాల్సిన పదార్థాలు, వాటిపరిమాణం, తయారీ విధానం, పోషక విలువల వివరాలు పుస్తకంలో పొందు పరిచి ఉన్నాయ న్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏలు, ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు, రైతులు పాల్గొన్నారు

