మన ఊరు మన శివన్న కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలో ని18వ వార్డులో శనివారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో విశేష స్పందన లభించింది. ప్రచారంలో అడుగడుగునా అభిమానంతో ప్రజలు గులాబీ పూల బాటలు వేశారు. ఇంటిం టికీ హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. దుశ్శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్క రించారు. వార్డు మొత్తం ప్రచారం పూర్తయ్యే వరకు స్థానికులు పూలు చల్లుకుంటూ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముందుగా లక్ష్మీ గణపతి స్వామి ఆలయం, శ్రీ కాశీ అన్నపూర్ణా దేవి మాతా సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వార్డులో వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయన్నారు. జగనన్న పాలనను మెచ్చి ప్రజలు వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పడు తున్నారన్నారు. కాపులందరికీ న్యాయం చేసేం దుకు కాపునేస్తం ప్రవేశ పెట్టి వారికి ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథ కాలు అందాయన్నారు. సీఎం వైఎస్ జగన్ కు కులాలు, మాతాల వంటి బేదాభిప్రాయాలు లేవని చెప్పారు. అందరినీ సమానంగా చూసే మంచి వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అన్నారు. మున్సి పాలిటీ మొత్తానికి సుమారు 100 కోట్లకు పైగా తాగునీటికి మంజూరయ్యాయని త్వరలోనే ఇంటింటికీ కుళాయిలు వేసి నీటి కష్టాలు తీరు స్తామని హామీ ఇచ్చారు. వార్డు ఇన్చార్జ్ హరీష్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. హరీష్ ను తన సొంత తమ్ముడిలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్తు చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ …గత ఎన్నికలకు ముందు పాద యాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన దమ్ము, ధైర్యం ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. కరోనా కష్ట కాలంలో సీఎం జగనన్న సైనికుల్లా ఎంతో ధైర్యంతో ప్రాణాలకు తెగించి వలంటీర్లు ప్రజలకు చేసిన సేవలు మరు వలేనివని చెప్పారు. రానున్న ఎన్నికల్లో దర్శిలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ ఆశీస్సులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో దర్శిబ్మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి ,పట్టణ అధ్యక్షులు కట్టికోట హరీష్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, ప్రచార కమిటీ జిల్లా కార్యదర్శి అంకబాబు, కాపా రమ ణారెడ్డి, జేసీఎస్ పట్టణ కన్వీనర్ ఎదురుకోటిరెడ్డి, వెన్నపూస సంజీవరెడ్డి, యాతం రమణారెడ్డి, కర్ణా రమణారెడ్డి, కర్ణా సుబ్బారెడ్డి, కర్ణా వెంకటరెడ్డి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ విమల రామకృష్ణ, కొల్లా ఉదయభాస్కర్, ఓబులాపురం సత్యనారాయణ, ఉల్లి గురువార్జున, బండారురమేష్, పాలంకి వెంకటేష్, పసుపులేటి నాగరాజు, ముత్తి నీడి కోటేశ్వరరావు, ఎదురు నరశింహారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, సుశీలా ప్రతాప్, సామ్యేల్, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కేసరి రాం భూపాల్ రెడ్డి, కర్ణా భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దామెర్ల చంద్రం, మాజీ సర్పంచ్లు చంద్రగిరిగురవా రెడ్డి, దామెర్ల రామ్మోహన్, కుంటా అచ్చారావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ యరమల మధుసూదన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు వేమి రెడ్డి చెన్నారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కేవీ రెడ్డి, సాగర్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ సద్దిపుల్లా రెడ్డి, శేషం రమణయ్య, ముప్పూరి బ్రహ్మయ్య, కర్ణా వెంకటరెడ్డి, పానుగంటి కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొ న్నారు.
మహిళా సాధికారత సీఎం జగనన్నతోనే సాధ్యం -జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
మహిళలకు అన్ని రంగాల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే మహిళా సాధికారత ,సంక్షేమం సాధ్యమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎ స్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని నూజిళ్లపల్లి, సుంకరవారిపాలెం గ్రామాల్లో శనివారం రాత్రి మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత పోలేరమ్మ గుడి, శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరించారు. స్థానిక ఎస్సీ కాలనీలో ఇంటింటా ప్రచారం చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ శివప్రసాదరెడ్డిలకు అడుగడుగునా మహిళలు పూల వర్షం కురిపిస్తూ ప్రచారంలో వెన్నంటి నిలిచారు. ప్రచార రథంపై జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లిశివప్రసాదరెడ్డిలు మాట్లాడుతూ …ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు వైఎస్సార్ సీపీ జెండా అండగా ఉంటుందన్నారు. పేద, నిరుపేదల అభ్యున్నతి కోసం పాటుపడే దేశం లోనే దమ్మున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నవరత్నాల నగదు మహిళల బ్యాంకు ఖాతలకు జమ కావాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలన్నారు. వంట ఇంటికే పరిమితమైన మన మహిళలకు జగనన్న పుణ్యమా.. అని సుంకర సునీత ఎం.పి.పి గా తాను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పదవిలో ఉన్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పో రేట్ కు దీటుగా తీర్చిదిద్దిన ఘనత జగనన్నతోనే సాధ్య మైందన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి మెలిసి పని చేసి రాబోయే ఎన్నికల్లో జగనన్నను సీఎంగా, శివన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపుని చ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, సర్పంచ్లు మండల మాజీ అధ్యకుడు చింతా శ్రీవాసరెడ్డి , మండల మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, జిల్లా
యూత్ కార్యదర్శి గర్నెపూడి ప్రసన్నకుమార్, సర్పంచ్ చొప్పరపు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కామినేని ఏడుకొండలు, నాయకులు, వేదరమెట్ల కోడండ రామయ్య, పుల్లంశెట్టి హనుమంతరావు , శ్రీను, చొప్పరపు రవి, శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, మేకల వెంకటే శ్వరరెడ్డి, అంజిరెడ్డి, కొండారెడ్డి, విందులపు అశోక్, అన్నపురెడ్డి భిక్షాలురెడ్డి, మేడగం రమణారెడ్డి , కృష్ణా రెడ్డి, పాలడుగు చిరంజీవి తాతపూడి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ షరీఫ్ కు బూచేపల్లి పరామర్శ
తాళ్లూరు మండలంలోని రామభ ద్రాపురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ ఆదాం షరీఫ్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు శనివారం పరామర్శించారు. ఆదాం షరీఫ్ (బుజ్జి) ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. సమాచారం తెలుసుకున్న వారు ఒంగోలులోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
డాక్టర్ బూచేపల్లి సాయం..
దర్శి పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన మేకల లింగమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు ఆపరేషన్ చేయించుకుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న బూచేపల్లి.. ఆమె అనారోగంతో
బాధపడుతోందని తెలుసుకుని నేరుగా వెళ్లి రూ.10 వేల ఆర్థిక సాయంతో పాటు వీల్ చైర్ అం దజేస్తానని హామీ ఇచ్చారు. లింగమ్మ కుటుంబ సభ్యులు శివప్రసాదరెడ్డి దాతృత్వానికి కృతజ్ఞ తలు తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తాళ్లూరు మండలంలోని బెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన గువ్వల వెంకట సుబ్బారెడ్డికి అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకు నేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రూ.3 లక్షల చెక్కును శనివారం ఆయన అందజేశారు. పార్టీ మండల కన్వీనర్ తూము సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ పోశం నారాయణరెడ్డి, గువ్వల శ్రీనివాసరెడ్డి, గూడా ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
దారం వారి పాలెంలో వివాహాలను హాజరు
దారం వారిపాలెంలో శనివారం రాత్రి రెండు వివాహా కార్యక్రమాలలో డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పాల్గొని వధూ వరులను ఆశీర్వ దించారు. మంచాల అశోక్ రెడ్డి, బొడ్డు శివ క్రిష్ణయాదవ్ వివాహానికి హాజరు కాగా వైస్ ఎంపీపీ మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి ,సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి వైఎస్ సర్పంచ్ దారం వెంకటేశ్వర్ రెడ్డి లు, మండల నాయకులు, బంధు మిత్రులు డాక్టర్ బూచేపల్లికి ఘన స్వాగతం పలికారు.











