పేద.మధ్యతరగతి నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు -జంట నగరాలలోని మూడు కమిషనరేట్ ల పరిధి లో విచ్చల విడిగా వడ్డీల పేరుతో రక్తం పిలుస్తున్న జలగలు -అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య లకు పాల్పడుతున్న మధ్య తరగతి కుటుంబాలు -పిర్యాదులు అందుతున్నా కటిన చర్యలు చేపట్టడం లో పోలీసుల మీన మేషాలు -పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని బాధిత కుటుంబాల అభ్యర్థన.

పేద, మధ్య తరగతి కి చెందిన చిరుద్యోగులు అత్యవసరంగా డబ్బు కావాల్సిన వారిని వలవేసి పట్టుకుంటారు. మీకు కావల్సిన డబ్బిస్తం .మేము చెప్పిన వడ్డీ చెల్లించాలి అంతే అంటూ వారిని బుట్టలో వేసుకుంటారు. అడిగిన మొత్తం ఇస్తాం అంటారు. ముందే వడ్డీ తీసుకుంటారు…ఇచ్చే మొత్తం లక్ష రూపాయలు అయితే 10 రోజులలో లక్షా అరవై వేలు చెల్లించాలి. అలా చెల్లించక పోతే వారి ఇంటి మీదకు వెళ్లి దౌర్జన్యం చేస్తారు. వీరు కాల్ మనీ వ్యాపారుల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముందు ఫోన్లు ఆ తర్వాత మందీ మార్బలంతో నేరుగా ఇంటికి చేరుకుని బెదిరింపులకు గురిచేసి మానసికంగా కుంగ దీస్తారు. ఇది తట్టు కొలేని
వారు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆత్మహత్యలు ఇప్పటికే జంట నగరాలలోని మూడు కమిషనరేట్ ల పరిధి లో చోటు చేసుకున్నాయి. కొందరు తమపై వస్తున్న వత్తిడిని తట్టు కొలేక పోలీస్ లకు పిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి ముఠాలు జంట నగరాల తో పాటు గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ఎల్బీ నగర్ , నల్గొండ , నిజామాబాద్, మెదక్ ల లో కూడా ఈ ముఠాలు తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. వీరు అయా ప్రాంతాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అమాయకులను వీరి అగడాలతో బలి చేస్తున్నారు. వీరి ఆగడాలకు నగరం లోని మియాపూర్ , ఎస్సార్ నగర్ లలో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలున్నాయి.ఇప్పటికే
ఈ ముఠాల పైన సైబరా బాద్,రాచకొండ ,హైదరాబాద్ పరిధిలో అందిన పిర్యాదుల ఆధారంగా కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. అయినా వీరి ఆగడాలు కొనసాగిస్తూనే ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వడ్డీ వ్యాపారుల దోపిడీలకు అడ్డుకట్ట వేయక పోతే మరెన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుంది.ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ఇలాంటి వారి అగడలపైన దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *