రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని సువర్ణ పాలన కొనసాగించాలని దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కోరారు. దర్శి పట్టణంలోని 19వ వార్డులో సోమవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి, సతీమణి నందినితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. తొలుత బూచేపల్లి కుటుంబ సభ్యులకు స్థానికు నేతలు క్రేన్ సాయంతో గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మహిళలు హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మసీదులో బూచేపల్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ..పేదల ప్రజలకు మేలు చేసేందుకే జగనన్న వైఎస్సార్ సీపీని స్థాపించారని, సంక్షేమ పథ కాల ద్వారా చేస్తున్న మేలును మరువద్ద న్నారు. చంద్రబాబుకు ఓటేయడం అంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వద్దనుకోవ మేనని స్పష్టం చేశారు. చంద్రబాబు మళ్లీ జన్మభూమి కమిటీలు తీసుకొచ్చి దోపిడీ చేయాలనే లక్ష్యంతో గోతికాడ నక్కలా కాచుకుని ఉన్నాడని ధ్వజమెత్తారు. చంద్ర బాబు లాంటి స్వార్థపరులకు ఓటుతోనే బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని ఉన్న జాబులను కూడా ఊడబీ కిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించి చరిత్ర తిరగరాశారన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులంతా కాలర్ ఎగరేసేలా జగనన్న పాలన సాగుతోందన్నారు.
బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. దోచుకోవడం దాచుకోవడమే చం ద్రబాబు నైజమని, అధికారం కోసం వెంప ర్లాడుతున్నాడని విమర్శించారు. ఏపీలో అధి కారంలో ఉన్నపుడు దోచుకున్న డబ్బుతో తెలంగాణాలో వందల కోట్లతో చంద్రబాబు ఇళ్లు కట్టుకున్నాడని ఆరోపించారు. ఏపీలో ఉండేందుకు ఇష్టం లేనివారు ఇక్కడి ప్రజలపై ప్రేమతో పాలన చేస్తారా అని ప్రశ్నిం చారు. అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మరోమారు అత్యధిక సీట్లతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్షకీలా అమీనాషా, షేక్ కార్పొరేషన్డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా,వార్డుఇన్చార్జ్ దారం మాల కొండయ్య, పట్టణఅధ్యక్షుడు కట్టెకోట హరీష్, శ్రీకాంత్,దామెర్ల రమేష్, ముస్లీం వెల్ఫేర్ అధ్యక్షులురహంతుల్లా, షేక్ అమీర్ భాషా, షేక్ ముజి
బుర్ రహమాన్, కరిముల్లా, షేక్ నాగూర్,ముస్లీమైనార్టీ అధ్యక్షులు షేక్ బాబు మేస్త్రి,షేక్ బసీర్,షేక్ మస్తాన్వలి,కరీం,రసూల్,లతీఫ్ మౌజన్, పానెం హుస్సేన్, ఖాదర్బాషా, చిన్నకాశీంవలి, పకీరయ్య, నాయబ్ రసూల్ , బిలాల్, అలవల అంజిరెడ్డి, మారంశివకోటిరెడ్డి, కర్ణా వెంకటరెడ్డి, నుసుంగోవిందరెడ్డి, యేరువ శ్రీనివాసరెడ్డి, మారంశ్రీనివాసరెడ్డి, దేవసాని రామకోటిరెడ్డి,ముచ్చుమారి కోటిరెడ్డి, అన్నపురెడ్డి మల్లారెడ్డి, సారెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, నెక్కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, ప్రచార కమిటీ కార్యదర్శి అంకబాబు, మాజీ సాగర్ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సద్దిపుల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గంజివెంకటేశ్వరరెడ్డి, బీసీ సెల్ సెక్రటరీచెరుకూరి జగన్, పుట్టా రవి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, చెమిరెడ్డి రాజారెడ్డి, ఎదురు నారాయణరెడ్డి, నాయకులుపాల్గొన్నారు.





దొనకొండ మండలంలో….
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన కన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్ర ప్రజలకు భేష్ గా ఉందని, తండ్రిని మించిన తన యుడిగా జగనన్న ప్రజల మనస్సును గెల్చుకున్నారని దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచే పల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు. సోమవారం మన దొనకొండకు మన శివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జోరుగా సాగింది. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, డాక్టర్ శివప్రసాదరెడ్డి విచ్చేసి ఎన్నికల ప్రచారం చేశారు. తొలుత స్థానిక అంబేడ్కర్ సెంటర్లో కార్యకర్తలు, నాయ కులు, ప్రజలు వారికి నిరాజనం పలికారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు, నాయకులు బూచేపల్లిని గజమాలతో సత్కరించారు. బస్టాండ్ సెంటర్లోని దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓబ్బాపురంలో రూ.10 లక్షల జిల్లా పరిషత్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం శివాజీనగర్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆలయం వద్ద మహిళలతో కొద్దిసేపు ముచ్చటించారు. అరబస్తాన్, శివాజీనగర్ కు సిమెంట్ రోడ్డు కోసం జిల్లా పరిషత్ నిధులు రూ.10 లక్షలు మం జూరు చేశారు. బేతేలుపురం, బ్రహ్మరావుపేట, సాయిబా బానగర్, ముస్లిం బజార్, వీవీపురం, గుట్టమీదపల్లి, ఓబ్బాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భం గా డాక్టర్ శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ అన్నలారా, తమ్ముల్లారా, అక్కా, చెల్లెళ్లలారా మీ శివన్న మీ ఇంటికి వచ్చి మీ పవిత్ర మైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. జగనన్న పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ మనం ఎన్నుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. పేద ప్రజలు, మహిళల కోసం జగనన్న అనేక సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదేనన్నారు. దమ్ము, ధైర్యం, ఓర్పు ఉన్న వ్యక్తి ఒక్క జగనన్ననే అని ఆయన్ను
మనం ఎప్పటికీ మరిచిపోవద్దని తెలిపారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉండి ఎన్నికల సమయంలో ప్రజ లకు మొండిచేయి చూపించారని, వారి కార్యకర్తలు పంది కొక్కులా మేసి జేబులు నింపుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పప్పుకు జగనన్న మీద పోటీ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పొత్తులతో పోటీ చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, జగ నన్న సింగిల్ గా పోటీ చేస్తారన్నారు. దొనకొండకు రూ.2 కోట్లతో రోడ్లు, మంచి నీటి వసతి కల్పిస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ తమ కుటుంబం దర్శి నియోజకవర్గానికి 2004 నుంచి సుపరి చితంగా ఉందని, మరి ముఖ్యంగా దొనకొండ ప్రజలంటే తమకు అభిమానమని తెలిపారు. తమ జీవితమంతా ప్రజా సేవకే అంకితమవుతామని, మీరు బూచేపల్లి కుటుం బాన్ని మరిచి పోవద్దని, మీ శివన్న మీ ఇంటి వద్దకు వస్తు న్నారని, ఆశీర్వదించి ఆదరించి మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. మీ ఓటును ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకీ ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి గెలిపించాలని వెంకాయమ్మ దొనకొండ ప్రజలను పేరు పేరునా నమస్కరించి కోరారు. బూచేపల్లి నందిని, మండల ఇన్చార్జి కాపా రమణారెడ్డి, ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ప్రస న్నాంజనేయరెడ్డి, కొంగలేటి గ్రేస్ ర త్నకుమారి దేవానంద్, వైస్ ఎంపీపీ మిట్టా కోటిరెడ్డి, బత్తుల వెంకట సుబ్బయ్య యాదవ్, ఇమ్రాన్బాన్, షేక్ గఫార్, గుంట అమ్మాజీ అజయ్, తాల్లూరి లక్ష్మీ నగేష్, ముజాయిద్, రహంతుల్లా, ఎన్ఏపీ శ్రీను, శివశంకర్, సైరాబాను, డోలా చంద్రశేఖర్, బుక్కారపు జయరావు, పిక్కిలి అంకయ్య, తాటిగిరి మదన్, నూనె వెంకటరెడ్డి, పత్తికొండ వెంకట సుబ్బయ్య, గుం టు పోలయ్య, పాతకోట కోటిరెడ్డి, రాచగొర్ల బోడయ్య, తమ్మనేని సుబ్బారెడ్డి, ఐలూరి శ్రీనివాసరెడ్డి, వెన్నపూస చెంచిరెడ్డి, అయూబ్, షేక్ యూనుస్, కదం శ్రీనివాసులు, దేవరాజు, గోనె జాకోబు, గుంటు ఐజక్, చెన్నుబోయిన గురుమూర్తి, ఐనోలు నాగయ్య, కాలూరి రమణయ్య, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




