తాళ్లూరు మండల కేంద్రమైన తాళ్లూరు లోని ఎస్టీలు, పాముల కులస్తులకు ప్రత్యేక స్మశాన వాటిక కేటాయించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్రరావు తో కలసి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య సోమవారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రం అందించారు. గత కొంతకాలంగా వారికి ప్రత్యేక స్మశాన వాటిక లేక మరణించిన వారి పార్థివ శరీరాలను ఎక్కడ పూడ్చాలో తెలియక గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటు న్నారని, వారి సమస్యను గుర్తించి ప్రత్యేక స్మశాన వాటిక కేటాయించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. తహసిల్దార్ కు వెంటనే తగిన ఉత్తర్వులు జారీ చేసి స్మశాన వాటిక కేటాయించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.

