విద్యార్థులు కష్ట పడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకోగలరని సమగ్రశిక్ష జీసీడీఓ ప్రమోద అన్నారు. స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ రానున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించాలన్నారు. అందుకోసం సబ్జెక్టుల వారీగా ప్రణాళికలు సిధ్ధం చేసుకొని చదవాలన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథ కాలు అమలు చేస్తున్నందున వాటిని సద్విని యోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాల న్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తే అవకాశాలు అవే వస్తాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయి ఆధారం గా వారికి దిశానిర్దేశం చేయాలన్నారు. కొంచెం వెనకబడిన వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు అనేక కష్టాలు పడుతున్నారనే విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తించుకోవాలన్నారు. పదో తరగతి, ఇంట ర్మీడియేట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి మంచి భవిష్యత్ ఉంటుంద న్నారు. ప్రిన్సిపాల్ సుజిత, ఉపాధ్యాయులు విరాజిత, నాగలక్ష్మి, లావణ్య పాల్గొన్నారు.

