బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలోమహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఓ బీ సి మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు. డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొని ముందుగా జ్యోతి రావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జ్యోతి రావు పూలే నూతన ఒరవడికి కృషీ చేసిన వ్యక్తి అన్నారు.ఆయన లాంటి వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ,ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చీరె సత్యనారాయణ (శ్రీకాంత్) తదితరులు పాల్గొన్నారు.


